వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

నల్లగొండ జిల్లా:ఈనెల 19,20వ తేదీలలో నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కట్టంగూరు మండల కేంద్రంలో జరుగు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 19వ మహాసభలను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య పిలుపునిచ్చారు.సోమవారం నిడమనూరు మండల కేంద్రంలో జరిగిన సంఘం 5వ మండల మహాసభకు ఆయన ముఖ్యాతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్య ప్రజలు, కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

 Win The District Congresses Of The Agricultural Labor Union-TeluguStop.com

అన్నింటినీ ప్రైవేట్ పరం చేయడం వల్ల నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని సామాన్యుడు మూడు పూటలా తిండి తినలేని పరిస్థితి దాపురించిందన్నారు.పేదలకు అందాల్సిన కూడు,గూడు,గుడ్డ పాలకుల విధానాల వల్ల అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని,పేదల పిల్లలు చదువుకు దూరం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్లను రద్దు చేయడం అన్యాయమన్నారు.ఉపాధి హామీ పనిలో 200 పని దినాలు కల్పిస్తూ కనీస వేతనం 600 తగ్గకుండా ఇవ్వాలని,పని చేసిన బిల్లులో వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

భూమిని నమ్ముకొని రెక్కల కష్టం చేసుకునే కూలీలకు 55 సంవత్సరాలకు పెన్షన్లు అందరికీ ఇవ్వాలని,రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు,ఖాళీ స్థలం ఉన్న ప్రతి పేదవాడికి ఐదు లక్షల తగ్గకుండా ఇవ్వాలని,భూమిలేని నిరుపేదలకు మూడు ఎకరాల భూమి పంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.సమాజంలో అసమానతలు,అంతరాలు,దోపిడీలు ఉన్నంతవరకు పేదల పక్షాన సంఘం పోరాడుతుందని,ఈ దేశంలో కూలి పోరాటాలు,భూమి పోరాటాలు నిరంతరాయంగా కొనసాగుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అంకెపాక సైదులు,జటావత్ రవి నాయక్,రైతు సంఘం సీనియర్ నాయకులు కత్తిలింగారెడ్డి,కందుకూరి కోటేష్,కుంచెం శేఖర్,మల్లికంటి చంద్రశేఖర్,యశోద,ఇరుగంటి ఎల్లమ్మ, కొండేటి సైదమ్మ,కన్నెబోయిన సైదులు, ఉప్పరి కొండల్,గూడపూరి బాలరాజు, బొల్లెపల్లి శంకరయ్య,గోపిశెట్టి వెంకటమ్మ, వింజమూరు పుల్లయ్య,సతీష్, రామలింగయ్య,బిక్షం తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube