నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పవర్ కట్ పేరుతో ధర్నా నిర్వహిస్తున్నట్లు పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్,విద్యుత్ జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు.కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా విధులు బహిష్కరిస్తున్నట్టు వారు తెలిపారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే పునరుద్ధరణ పనులు చేయకుండా నిరసన తెలుపుతామని కావున విద్యుత్ వినియోగదారులు, రైతులు గమనించి సహకరించాలని కోరారు.