మండలాల వారీగా కోఆర్డినేటర్ల నియామకం

నల్లగొండ జిల్లా:కాంగ్రేస్ పార్టీ భారతదేశంలో సామాజిక న్యాయాన్ని, లౌకికత్వాన్ని సామ్యవాదాన్ని, ప్రజాసామాన్ని భారత జాతీయ కాంగ్రెస్ మాత్రమే కాపాడిందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి పేర్కొన్నారు.ఈరోజు హైదరాబాద్‌ లోని మల్లు రవి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ సామాజిక న్యాయ బృందం (సోషల్ జస్టిస్ టీమ్) సమావేశం జరిగింది.

 Appointment Of Zone Wise Coordinators-TeluguStop.com

దీనిలో ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికల్లో చేయాల్సిన కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది.ఈ సందర్భంగా మల్లు రవి ఒక ప్రకటన విడుదల చేస్తూ కాంగ్రెస్ ఈ దేశంలో బడుగు బలహీనవర్గాల యొక్క అస్థిత్వాన్ని కాపాడిందని పేర్కొన్నారు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో సామాజిక న్యాయంతో పార్టీకి ముందుకు సాగుతుందని వివరించారు.కొన్ని స్వార్థ శక్తులు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలని చూస్తున్నారని తెలిపారు.

టీఆర్ఎస్,బీజేపీ పార్టీలు భారత ప్రజాస్వామ్యానికి,రాజ్యాంగానికి తూట్లు పొడిచారని, కాంగ్రెస్ పార్టీ కోసం మరింత పని చేయాలని తీర్మానించినట్లు వెల్లడించారు.ఈ పరిస్థితుల్లో మునుగోడు ఉప ఎన్నిక చాలా ప్రాధాన్యత సంతరించుకుందని,కాంగ్రెస్ కు నష్టం చేయాలనే ఉద్దేశంతో తేవాలనుకుంటున్న ఈ ఎన్నిక వస్తే అందరూ బాధ్యతలు పంచుకొని మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రత్యక్ష కార్యాచరణ తీసుకోవాలని సోషల్ జస్టిస్ టీమ్ మండలాల వారీగా కో-ఆర్డినేటర్ బాధ్యతలు తీసుకుందన్నారు.

ఈ సమావేశంలో అద్దంకి దయాకర్,బండి సుధాకర్ గౌడ్,కేతూరి వెంకటేష్, కురువ విజయ కుమార్,దుర్గం భాస్కర్,నందమూరి దత్తాత్రేయ,రమేష్ రాథోడ్,పరశురాములు,కెతావత్ శంకర్ నాయక్,చరణ్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

మునుగోడు మండలాల వారీగా కోఆర్డినేటర్లు.

చౌటప్పల్ మండలం టౌన్‌కు డాక్టర్ కురువ విజయ్ కుమార్,సంస్థాన్ నారాయణపురం మండలానికి కేతూరి వెంకటేష్,గట్టుప్పల్‌కు చరణ్ కౌశిక్,చండూరు మండలాని బెల్లయ్య నాయక్,నాంపల్లికి అద్దంకి దయాకర్,మునుగోడు కోఆర్డినేటర్ బండి సుధాకర్ గౌడ్,మర్రిగూడ మండలానికి దుర్గం భాస్కర్‌ను నియమించారు.వీరితో కాంగ్రెస్ శ్రేణులందరూ సహకరించి పార్టీ విజయానికి దోహదపడాలని మల్లు రవి విజ్ఞప్తి చేశారు.

ఈ టీమ్‌కు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ తోపాటు మునుగోడు కాంగ్రెస్ మండల అధ్యక్షులతో ఈ టీమ్ సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube