నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలో అత్యంత రద్దీగా ఉండే ఫ్లై ఓవర్-నాగార్జున సాగర్ ప్రధాన జాతీయ రహదారి వెంట నోళ్ళు తెరిచిన మ్యాన్ హోల్స్, ఆర్డీవో ఆఫీస్ నుండి శివాలయం,ఆంజనేయ స్వామి గుడి,హాస్పిటల్స్, చర్చి,పోలీస్ స్టేషన్ తదితర ప్రాంతాలకు వెళ్లే దారిలో అసంపూర్తిగా “వి” ఆకారంలో ఉన్న సీసీ రోడ్ వల్ల పట్టణ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మున్సిపల్ సిబ్బంది మ్యాన్ హోల్ మూతలు తెరిచి,మళ్ళీ వేయకపోవడంతో వచ్చే పోయేవారికి ప్రమాదకరంగా మారగా, అందులో ఎర్రజెండాను ఉంచి ఇది డేంజర్ స్పాట్ గా తెలిసేలా చేశారు.“వి”ఆకార సీసీ రోడ్లో డ్రైనేజీ నిలిచిపోయి వచ్చే దుర్వాసనతో పాటు ఎదురుగా వాహనం వస్తే వచ్చినప్పుడు ప్రమాదవశాత్తు ఆ డ్రైనేజీలో పడిపోయే ప్రమాదం ఉండడంతో నిత్యం నానా తిప్పలు పడుతున్నారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నిద్రమత్తు వీడి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా జరగకుండా చూడాలని మ్యాన్ హోల్స్ మూతలు వేసి,సిసి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు.
స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చొరవ తీసుకొని నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకొని ప్రజల ఇబ్బందులను తొలగించాలని వేడుకుంటున్నారు.