తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలో ప్రస్తుతం కొత్తగా నమోదైన కేసుల వివరాలు అదేవిధంగా పరిస్థితి గురించి హెల్త్ బులిటెన్ ఈరోజు ఉదయం రిలీజ్ చేయడం జరిగింది.రిలీజ్ అయిన వివరాలు బట్టి చూస్తే దేశంలో గడచిన 24 గంటల్లో 12,143 మందికి కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది.
అదే సమయంలో 11,395 మంది కరోనా నుండి కోలుకున్నారు.దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,92,746కు చేరింది.
ఇక గడచిన 24 గంటల్లో ఈ మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా చనిపోయిన మృతుల సంఖ్య 103.ఇక మొత్తం మృతుల సంఖ్య చూసుకుంటే 1,55,550కు పెరిగింది.
దేశవ్యాప్తంగా కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య చూసుకుంటే 1,06,00,625.ఇదిలా ఉంటే మరో పక్క వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలు స్పీడ్ అందుకున్నాయి.
కేంద్రం యుద్ధప్రాతిపదికన రాష్ట్రాలకు ఇస్తున్న ఆదేశాలతో ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య చూస్తే 79,67,647.ఇదే స్పీడు కొనసాగితే దేశ వ్యాప్తంగా త్వరగానే కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం పూర్తవడం గ్యారెంటీ అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
.