నల్లగొండ జిల్లా: కేతేపల్లి మండలం బోప్పారం గ్రామానికి చెందిన దోనకొండ సంధ్యకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కి చెందిన బాసని విష్ణుతో గత పదిహేనేళ్ల క్రితం వివాహమైంది.వీరికి రూప, నందు,మణికంఠ ముగ్గురు పిల్లలు.
సాఫిగా సాగుతున్న వీరి కుటుంబంపై విధి పగపట్టింది.అప్పుల బాధతో విష్ణు గతేడాది ఆత్మహత్య చేసుకోగా, ఇటివల సంధ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
తల్లిదండ్రులు చనిపోవడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.
విషయం తెలుసుకున్న సంధ్యతో చదివిన పదోతరగతి క్లాస్ మేట్స్ పిల్లల పరిస్థితిపై చలించిపోయారు.ముగ్గురు చిన్నారులకు రూ.50 వేల ఆర్థిక సహాయం, రెండు నెలలకు సరిపడా నిత్య అవసర వస్తువులు అందజేసి మానవత్వం చాటుకున్నారు.పిల్లల చదువుల కోసం కూడా తాము కృషి చేస్తామని తెలిపారు.ముగ్గురు చిన్నారులు సంధ్య తల్లిదండ్రులు వద్ద ఉంటున్నారు.వారు వృద్ధులు కావడంతో పిల్లల పోషణ భారంగా మారిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.పిల్లల పోషణ,చదువులకై దాతలు ముందుకు రావాలని కోరారు.
సహాయం చేసే దాతలు 991228326 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని కోరారు.