నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర శాసన సభ సమా వేశాలు ఈరోజు నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే అంశాన్ని ఈరోజు బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు.ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈనెల 15న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.16వ తేదీన శాసనసభలో, మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పెట్టి చర్చిస్తారు.

 Telangana Assembly Meetings From Today, Telangana Assembly , Congress Govt, Tela-TeluguStop.com

17వ తేదీన సైతం సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.ఈనెల 10వ తేదీన కొత్తగా ఏర్పాటైన సర్కార్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిం చింది.

ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్​ను ఎన్నుకుని ఆయనతో సహా 101 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.పలు కారణాలతో మరో 18 మంది ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.

ఆరోజు వాయిదా పడిన సమావేశాలు తిరిగి నేడు ప్రారంభం కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube