ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.రిమ్స్ ఎమర్జెన్సీ వార్డు దగ్గర మెడికోలు నిరసనకు దిగారు.
రిమ్స్ డైరెక్టర్ తో పాటు అసోసియేటెడ్ ప్రొఫెసర్ క్రాంతిని విధుల నుంచి తొలగించాలని మెడికోలు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆస్పత్రి ఎదుట బైటాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
అనంతరం ర్యాలీగా వెళ్లి మెడికోలు జిల్లా కలెక్టర్ ను కలవనున్నారు.అయితే అర్థరాత్రి మెడికోలపై దాడి జరిగిన విషయం తెలిసిందే.
ఈ దాడిలో ఇద్దరు వైద్య విద్యార్థులకు గాయాలు అయ్యాయి.అయితే ఈ ఘటనకు రిమ్స్ డైరెక్టర్ తో పాటు అసోసియేటెడ్ ప్రొఫెసర్ కూడా కారణమని మెడికోలు ఆరోపిస్తున్నారు.