ఇద్దరు యువతులు ఆత్మహత్యాయత్నం...!

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలో రాంనగర్ రాజీవ్ పార్కు( Rajiv Park )లో గడ్డి మందు తాగి ఇద్దరు యువతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం కలకలం రేపుతోంది.నల్గొండ మహిళ డిగ్రీ కళాశాలలో బీజెడ్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన ఎనుగుదుల మనీషా (20),నక్కలపల్లి గ్రామానికి చెందిన దంతబోయిన శివాని(20)( Shivani ) అనే విద్యార్థినులుగా తెలుస్తోంది.

 Two Young Women Attempted Suicide , Nalgonda Government Hospital , Nalgonda ,-TeluguStop.com

స్థానికులు వారిని గుర్తించి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి( Nalgonda Government Hospital )తరలించగా చికిత్స పొందుతున్నారు.ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఇద్దరు యువతులు ఒకేసారి ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డారనే విషయం ఇంకా తెలియరాలేదు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube