ఊపు మీదున్న జిల్లా కాంగ్రెస్-ఊహించని షాకులతో బీఆర్ఎస్

నల్లగొండ జిల్లా:12 అంసెంబ్లీ,2 పార్లమెంట్ సెగ్మెంట్లతో కూడిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట కాగా తర్వాత కాంగ్రెస్ ఖిల్లాగా మారింది.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014 లో జరిగిన తొలి ఎన్నికల్లో నల్గొండ,నాగార్జునసాగర్,మిర్యాలగూడ,కోదాడ, హుజూర్ నగర్ లో కాంగ్రెస్ విజయం సాధించగా, టీఆర్ఎస్ సూర్యాపేట, తుంగతుర్తి,ఆలేరు,భువనగిరి,నకిరేకల్, మునుగోడు సీట్లు కైవసం చేసుకొని సమ ఉజ్జిలుగా నిలిచాయి.

 District Congress In Swing-brs With Unexpected Shocks-TeluguStop.com

దేవరకొండలో సీపీఐ నుండి గెలిచిన రవీంద్ర నాయక్,కాంగ్రెస్ నుండి గెలిచిన నల్లమోతు భాస్కర్ రావు (మిర్యాలగూడ)టీఆర్ఎస్( TRS ) గూటికి చేరడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 8 కి చేరుకొని కాంగ్రెస్ పై పైచెయ్యి సాధించింది.అనంతరం 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన వారసత్వ ఓటు బ్యాంక్ ను,సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడంలో విఫలమైంది.

దానితో కాంగ్రెస్ సిట్టింగ్స్ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పాగా వేసింది.అందులో నల్లగొండ (కోమటిరెడ్డి వెంకటరెడ్డి),కోదాడ (పద్మావతి రెడ్డి), నాగార్జునసాగర్ (జానారెడ్డి) ఓడిపోగా, నకిరేకల్,హుజూర్ నగర్, మునుగోడు( Munugodu ) ముచ్చటగా మూడు గెలిచింది.

అవి కూడా మూన్నాళ్ళ ముచ్చటగానే ఉన్నాయి.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి కారెక్కడం, ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్,మునుగోడును కూడా కాంగ్రెస్ కోల్పోవడంతో 12 స్థానాల్లో గులాబీ జెండా ఎగరేసి మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లాను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది.

అప్పటికే జవసత్వాలు ఉడికి పార్టీకి పూర్వవైభవం వస్తుందో లేదో తెలియక,అధికార పార్టీ వత్తిళ్లు తట్టుకోలేక అనేకమంది లీడర్లు, క్యాడర్ కాంగ్రెస్ ను వీడి కారెక్కేశారు.ఇక జిల్లాలో కాంగ్రెస్ పని ఖతం అయినట్లేనని రాజకీయ విశ్లేషకులు సైతం ఓ అభిప్రాయానికి వచ్చారు.

కానీ,ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఎన్నికల తాజా పరిణామాలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా ఉందనే భావన కలుగుతుంది.ఎవరికివారే యమునాతీరే అన్నట్లుగా ఉండే కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు కాస్త గేర్ మర్చినట్లుగా ఉన్నారు.

అవును ప్రస్తుత రాజకీయ పరిస్థితులను జాగ్రతగా పరిశీలిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్లు సీరియస్ అయినట్లు తెలుస్తోంది.ప్రతిసారీ తమ గెలుపు, ఓటమి మీద అంచనాలు వేసుకుంటూ పార్టీకి జరిగే డ్యామేజ్ గురించి పట్టించుకోని సీనియర్స్ ఈ సారి ఫోకస్ మొత్తం గులాబీ పార్టీపై పెట్టినట్లు తెలుస్తోంది.

దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి నేతలపై స్పెషల్ ఫోకస్ పెట్టి భారీ ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తున్నారు.మరీ ముఖ్యంగా నాగార్జున సాగర్ లో తనయుడి కోసం పార్టీ కురువృద్దుడు కుందూరు జానారెడ్డి,మాజీ టిపిసీసీ చీఫ్,నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి,మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ రాజకీయ ప్రత్యర్ధులను మట్టి కరిపించెందుకు విరామమెరగక శ్రమిస్తున్నారు.

ఎలాగైనా ఈ సారి జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలనే తలంపుతో అడుగులు వేస్తున్నారు.మరోవైపు కాంగ్రెసు యువరక్తం కూడా విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్లు స్టార్ట్ చేసిన పొలిటికల్ గేమ్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి అంతుచిక్కడం లేదు.పార్టీ నుండి ఊహించని రీతిలో లీడర్లు,క్యాడర్ హస్తం గూటికి చేరుతుండడంతో అధికార పార్టీలో అంతర్మధనం మొదలయ్యింది.

ముఖ్యంగా జిల్లాలో దాదాపు అన్ని నియోజక వర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని సొంత పార్టీ నేతలు పట్టుబట్టారు.వారి మాటలను కేసీఆర్ పక్కన పెట్టడంతో కొందరు రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగేందుకు కార్యాచరణ సిద్దం చేసుకోగా, ఇంకొందరు మా బలం ఏమిటో మేము కేసీఆర్ చూపిస్తామని మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ బాట పడుతున్నారు.

ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ( Nalgonda district )కాంగ్రెస్ జోరు ఓ రేంజ్ లో ఉందని,అయితే నేటి రాజకీయాల్లో ఉదయం ఒక పార్టీలో సాయంత్రం ఇంకో పార్టీలో చేరుతున్న దాఖలాలు కోకొల్లలుగా ఉన్నాయి.వచ్చే వారంతా ఉండే వారైనా? ఉన్న వారిలో ఉండే వారెందరూ? మోకా మీదికి వచ్చే వరకు తరాజు ఎటువైపు మొగ్గుతుందో ఏమో కానీ,ఇప్పటికైతే హస్తం స్పీడ్ హై లెవల్ లో ఉందని చెప్పక తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube