నల్గొండ జిల్లా:దామరచర్ల మండల( Damercherla ) పరిధిలో వీర్లపాలెం వద్ద సుమారు రూ.30 వేల కోట్లతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ కు వెళ్లే ప్రధాన రహదారి వాహనదారులకు, ప్రయాణికులకు నరకం చూపిస్తుంది.
ప్లాంట్( Yadadri Thermal Power Plant ) నిర్మాణ పనుల నిమిత్తం నిత్యం వందలాది భారీ లారీలు,కార్లు,బైకులు,వేలాదిమంది ప్రయాణికులు ఈ రోడ్డు మీదుగానే ప్లాంట్ కు చేరుకోవాల్సి ఉంటుంది.పది కిలో మీటర్లకు పైగా ఉన్న ఈ రోడ్డు అడుగడుగునా గోతులు పడి అధ్వాన్నంగా మారింది.
గోతుల రోడ్లపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు.మరోవైపు వాహనాలు దెబ్బతిని, యాక్సిడెంట్లు అవుతున్నా ఆర్ అండ్ బీ అధికారులు మొక్కుబడి రిపేర్లతో నెట్టుకొస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్లాంట్ నిర్మాణ సమయం నుంచి నేటి వరకు రోడ్డు అడ్వాన్నంగానే ఉందని, గత ప్రభుత్వం పోయి కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ పాలనలోనూ ఈ రోడ్డు పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తక్షణమే రోడ్డును ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కలిగేల నిర్మించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.