మునుగోడు బరిలో వందమంది వీఆర్ఏలు

నల్లగొండ జిల్లా:గత 71 రోజులుగా సమ్మెలో ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ)లను రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకపోగా, వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన వీఆర్ఏల పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసీఆర్ పై వీఆర్ఏ రాష్ట్ర జేఏసీ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.సోమవారం మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మునుగోడు మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న వీఆర్ఏలు సోమవారం మునుగోడులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సంచలన ప్రకటన చేశారు.

 There Were A Hundred Vras In Munugodu Bari-TeluguStop.com

మునుగోడు ఉప ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారి సంఖ్యలో విఆర్ఏలు నామినేషన్స్ వేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలిపారు.జేఏసీ నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన పే స్కేల్ జీవో నేటి వరకు కూడా అమలు కాకపోవడంతో సమ్మెలో ఉన్న మా వీఆర్ఏ మిత్రులు 40 మంది ఆర్థిక ఇబ్బందులతో మరణించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మునుగోడులో వీఆర్ఏలు బారి సంఖ్యలో నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ జిల్లా కన్వీనర్ కోర్రే యాదగిరి,జిల్లా కో కన్వీనర్ వడ్డేపల్లి నర్సింహ,నల్గొండ డివిజన్ కొ కన్వీనర్ రహమాన్,చండురు మండల అధ్యక్షులు బేరే రామచంద్రు,మునుగోడు మండల అధ్యక్షులు చింతపల్లి మల్లయ్య,నాంపల్లి మండల అధ్యక్షుడు మేడిపల్లి వెంకటయ్య,మర్రిగుడ ఉపాధ్యక్షులు జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube