నల్లగొండ జిల్లా:శ్రీలంక సంక్షోభాన్ని తీర్చడానికి వారికి ఇంధనం సరఫరా చేసిన కేంద్ర ప్రభుత్వం మనల్ని సంక్షోభంలోకి నెట్టిందని ప్రజా పోరాట సమితి (పీఆర్ పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.గురువారం నల్లగొండ జిల్లాలో ఏర్పడిన పెట్రోల్,డీజిల్ కృత్రిమ కొరతపై ఆయన మాట్లాడుతూ జిల్లాలో దాదాపు అన్ని ఆయిల్ కంపెనీలకు సంబంధించిన పెట్రోల్ బంకులన్నీ డిజిల్,పెట్రోల్ లేకుండా వెలవెలబోతున్నాయని,ఎత్తుగడగా నోస్టాక్ బోర్డ్ పెట్టకుండానే పెట్రోల్ బంకులన్నింటికీ రాళ్ళు అడ్డంగా పెట్టి,వాహనాలు లోనికి వెళ్ళకుండా త్రాళ్ళతో కట్టేసి ఇంధనం లేదని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పుడో ఇప్పుడో కొద్దో గొప్పో పెట్రోల్ బంకులకు ఇంధనం వస్తే వాహనదారులు క్యూ కట్టగా క్షణాల్లోనే ఇంధనం అయిపోతోందన్నారు.విద్యాలయాలు,వ్యవసాయాలు ప్రారంభమైన ప్రస్తుత స్థితిలో తక్షణం ఈ పెట్రోల్,డిజిల్ కొరతను తీర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.