నల్లగొండ జిల్లా: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ జిల్లా నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణ కోసం అధికారులు పర్యటించే వాహనానికి కెమెరా ఏర్పాటు చేసి ప్లయింగ్ స్క్వాడ్ బృందం రెండు మండలల్లో పర్యటిస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలాంటి అవరోధాలకు తావులేకుండా చూసేందుకు ప్లయింగ్ స్క్వాడ్ కెమెరా ద్వారా రికార్డు చేస్తున్నట్లు స్క్వాడ్ సభ్యుడు యశ్వంత్ తెలిపారు.