నల్లగొండ జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 30వ తారీకున పోలింగ్ ఉన్న విషయం తెలిసిందే.దీనితో ఈనెల 28,29,30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వైన్స్, బార్లు మూసివేయాలని ఆబ్కారి శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 1279 వైన్ షాపులు సమస్యాత్మకమైనవిగా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు.మూసుకున్న వైన్స్, బార్లు తిరిగి డిసెంబర్ ఒకటిన తెరుచుకుంటాయని తెలిపారు.మూడు రోజులు వైన్ షాపులు బంద్ అవ్వనుండడంతో వైన్ షాపుల వద్ద మద్యం ప్రయుల హడావిడి మొదలైంది.కొన్నిచోట్ల వైన్ షాపు ఓనర్స్ నో స్టాక్ బోర్డు పేట్టేయడం గమనార్హం.