నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును రాష్ట్రంలో ఏదైనా ఒక జిల్లాకు నామకరణం చేయాలని మునుగోడు ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.శుక్రవారం నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ, జయంతి సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కోసం పదవి త్యాగం చేసి, పార్టీలకు అతీతంగా పోరాటం చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని,ఆయన ఆలోచనలు, ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.2009 లో తెలంగాణ ఎంపీలం అందరం ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమంలో పోరాడుతున్న సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఎంతో ప్రోత్సహించేవారని గుర్తు చేశారు.తెలంగాణ చేనేత కార్మికులు నైపుణ్యం ప్రపంచం స్థాయిలో గుర్తంపు ఉందని కొనియాడారు.చేనేత కార్మికుల సమస్యలఫై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి,చేనేత కార్మికులు నేసిన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు.




Latest Nalgonda News