యాదాద్రి భువనగిరి జిల్లా:ఎరువుల,విత్తన దుకాణదారులు రైతులకు నాణ్యమైన విత్తనాలను అందివ్వాలని ఏడీఏ శాంతినిర్మల అన్నారు.శుక్రవారం మోటకొండూరులో ఉన్న పలు విత్తన,ఎరువుల దుకాణాలలో ఆమె ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
దుకాణాల్లో నిలవున్న స్టాక్,బిల్లు బుక్ లను పరిశీలించారు.రైతులకు నాణ్యమైన విత్తనాలను అందివ్వాలని,నకిలీ విత్తనాలను అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం రైతు వేదికలను గ్రామాల్లో పంటలను పరిశీలించి రైతులకు పలు వ్యవసాయ మెలుకువలు చెబుతూ సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయధికారిణి రమాదేవి,వ్యవసాయ విస్తరణ అధికారిణి సంధ్య,రైతులు పాల్గోన్నారు.







