చెర్వుగట్టును దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా: ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని కరోనా లాంటి మహమ్మారి మళ్లేప్పుడూ రాకుండా ఆరోగ్యంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నానని రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.శనివారం నార్కట్ పల్లిలోని జడల లింగేశ్వరస్వామి ఆలయాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 Minister Komatireddy Venkatareddy Visited Chervugattu, Minister Komatireddy Venk-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాబోయే మూడు నెలల్లో బ్రాహ్మణ వెళ్ళేంల ప్రాజెక్టు నుండి నీటి విడుదల చేస్తామని,

మొదటి విడతలో 60 వేల ఎకరాలకు నీటి విడుదల చేస్తామని,అదే రోజు మహాత్మాగాంధీ యూనివర్సిటీ, చెర్వుగట్టులో సీఎం రేవంత్ రెడ్డిచే సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.చెర్వుగట్టుకు రెండో ఘాట్ రోడ్డు,భక్తులు నిద్రించేందుకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

జిల్లాలో ప్రస్తుతం నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని,రాబోయే కాలంలో బ్రాహ్మణ వెల్లంల, ఎస్ఎల్బీసీ,డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కరించి పేదల గుండెల్లో ఉంటామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube