యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ) కు మాస్ ఫ్యాన్స్ లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇండస్ట్రీలో నాగశౌర్య, విశ్వక్ సేన్( Nagashaurya, Vishwak Sen ) మరి కొందరు హీరోలు సైతం జూనియర్ ఎన్టీఆర్ ను ఎంతగానో అభిమానిస్తారు.బాలయ్యను వారానికి ఒకసారి కలవనని అయితే వారానికి ఒకసారి మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చారు.
వీలు కుదిరితే మాత్రం బాలయ్యను కలుస్తానని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs of Godavari ) షూట్ సమయంలో గాయమైందని ఆయన అన్నారు.
గాయం గురించి తెలిసి బాలయ్య( Balayya ) నన్ను కలిశారని ఫైట్ సీన్ కు ఆయనే ముహూర్తం పెట్టారని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.బాలయ్య బాబు ఎంతో కేరింగ్ గా చూసుకుంటారని ఆ విషయాలను మాటల్లో చెప్పలేనని విశ్వక్ సేన్ అభిప్రాయపడ్డారు.
నేను కష్టాల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.యూఎస్ లో ప్రోగ్రామ్స్ ఉన్నా వాటిని క్యాన్సిల్ చేసుకుని ఎన్టీఆర్ ధమ్కీ సినిమా ఈవెంట్ కు వచ్చారని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ చూపించిన ప్రేమను జీవితాంతం మరిచిపోలేనని విశ్వక్ సేన్ వెల్లడించడం గమనార్హం.తారక్ నాకు జీవితాన్ని మలుపునిచ్చే సలహా ఇచ్చారని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు.విశ్వక్ సేన్ నటించిన గామి ( Gami )మార్చి నెల 8వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోరా గెటప్ లో కనిపించనున్నారు.
గామి సినిమాకు సంబంధించి విశ్వక్ సేన్ లుక్స్ కు మంచి మార్కులు పడ్డాయనే సంగతి తెలిసిందే.

సినిమా సినిమాకు కథల విషయంలో వైవిధ్యం చూపిస్తున్న విశ్వక్ సేన్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తన సినిమాల పాటల విషయంలో సైతం విశ్వక్ సేన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.విశ్వక్ సేన్ టాలెంట్ ఉన్న దర్శకులకు ఛాన్స్ ఇస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు.







