ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్( CM Aravind Kejriwal ) కోర్టు ఎదుట హాజరయ్యారు.ఈ మేరకు ఆయన వర్చువల్ విధానంలో రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) ముందు హాజరు అయ్యారు.
అయితే ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేసిన ఫిర్యాదుపై ఇటీవల కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్న నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి కేజ్రీవాల్ మినహాయింపు కోరారు.దీనికి అంగీకరించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.







