తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాయి.ఈ క్రమంలో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు సీపీఐ పార్టీలోనూ సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ముసలం రాజుకుంది.మునుగోడు నియోజకవర్గ సీటు కోసం ఒత్తిడి పెంచాలని నల్గొండ జిల్లా సీపీఐ నాయకుల తీర్మానం చేశారని తెలుస్తోంది.
అలాగే చెన్నూరు స్థానాన్ని కాంగ్రెస్ ను కోరవద్దని సింగరేణి కాలరీస్ వర్కర్స్ లేఖ రాశారని సమాచారం.చెన్నూరులో సీపీఐ పోటీ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయంటూ పార్టీకి లేఖ రాశారు.