రౌండ్ టేబుల్ సమావేశం

నల్లగొండ జిల్లా:పోలీస్ రిక్రూట్ మెంట్ మార్కుల్లో అవకతవకలు సరి చేయాలని,బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావును వెంటనే విధుల నుండి తొలగించాలని ఎమ్మార్పీఎస్,ఏమ్మేస్పీ మరియు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు.శనివారం జిల్లా కేంద్రంలోని పి.

 Round Table Meeting-TeluguStop.com

ఆర్.టి.యు భవన్ లో ఎమ్మార్పీఎస్,ఎమ్మేస్పీ మరియు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెస్సీ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెస్పీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి కందుకూరి సోమయ్య మాదిగ,ఎమ్మార్పీఎస్ నల్లగొండ జిల్లా ఇన్చార్జ్ బోడ సునీల్ మాదిగ,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ తీసుకున్న రిజర్వేషన్ల అమలులో నిబంధనలు అతిక్రమించారని, రాజ్యాంగ పరిధిలో ఉన్న రిజర్వేషన్లు అమలు చేయడం లేదని ఆరోపించారు.

ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్లను అమలు చేయని బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావును వెంటనే సస్పెండ్ చేసి,ఎస్సీ,ఎస్టీ, బీసీ ఐపీఎస్ అధికారులను నియమించాలని వారు డిమాండ్ చేశారు.ఎస్సీ,ఎస్టీలకు ప్రత్యేక చట్టం ఉందని,రాజ్యాంగం మారుస్తానని సీఎం కేసీఆర్ ఎలా కామెంట్స్ చేశారో అలాగే పరోక్షంగా రాజ్యాంగాన్ని మార్చడానికి కెసిఆర్ సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తోందన్నారు.పరీక్షా ఫలితాలు రాకముందే సబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ కోరారని,దాన్ని వెంటనే అమలు చేసి పోలీస్ రిక్రూట్ మెంట్ లో అందరికీ సమానమైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఒకవేళ బోర్డు నిర్ణయం తప్పయితే బోర్డే బాధ్యత వహించాలన్నారు.సీఎం కేసీఆర్ దీనిపై నిర్ణయం తీసుకోకుంటే ఇదే ఆయన రాజకీయ పతనానికి నాంది అవుతుందన్నారు.ఈనెల 11న అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు వారి క్యాంపు ఆఫీసులలో వినతి పత్రాలు ఇస్తామన్నారు.12న హైదరాబాద్ లోని ఎమ్మెల్యేల క్వార్టర్స్ కు వెళ్తామని 13న ఎస్సీ,ఎస్టీ,బీసీల సామూహిక దీక్షలను హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో వద్ద నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ చోల్లేటి ప్రభాకర్,ఎమ్మెస్పీ నల్లగొండ జిల్లా ఇంచార్జ్ ఆడెపు నాగార్జున,తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు,పి.వై.ఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఇందూరు సాగర్,తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి భిక్షమయ్య,బి.సి.విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్,మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రేకల సైదులు,బిఎస్పి నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జి వంటపాక యాదగిరి,జాతీయ మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్,తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బోగరి విజయ్ కుమార్,ఎమ్మార్పీఎస్ జిల్లా కో- కన్వీనర్ ఇరిగి శ్రీశైలం,ఎంఎస్పి నకిరేకల్ నియోజకవర్గం ఇన్చార్జి మేడి శంకర్,ఎమ్మెస్సీ మిర్యాలగూడ ఇన్చార్జి మచ్చ ఏడుకొండలు, టీ.ఎస్.యు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి,మహిళా అధ్యక్షురాలు కురుపాటి కమలమ్మ,వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొత్త వెంకన్న,సమాచార హక్కు చట్టం రాష్ట్ర కార్యదర్శి బోగరి రామకృష్ణ,ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ నాయకులు బొజ్జ దేవయ్య,సంద నాగరాజు,కత్తుల సన్నీ,శంకర్, జీడిమెట్ల రవీందర్,నారపాక శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube