ముఖ్యంగా చెప్పాలంటే మాంసాహారం( non-vegetarian ) ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం( obesity ) పెరుగుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.ఎందుకంటే అధిక కొవ్వు మాంసంలో ఎక్కువగా ఉంటుంది.
అంతేకాకుండా కొవ్వు అసమతుల్యత ఏర్పడడానికి ముఖ్య కారణం ఇదే అని నిపుణులు చెబుతున్నారు.దీనివల్ల కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి.
మాంసాహారం ఎక్కువ తినడం వల్ల జీర్ణం వ్యవస్థ ( Digestive system )పై చెడు ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఆరోగ్యంలో తక్కువ ఫైబర్ కారణంగా పేగులలో ఇన్ఫెక్షన్ ప్రమాదం కూడా పెరుగుతుంది.
పొట్టలో ఆమ్లం పెరగడం వల్ల ఎముకలు, కీళ్లలో నొప్పి మొదలయ్యి అసౌకర్యంగా అనిపిస్తుంది.
మాంసాహారం ఎక్కువగా తినాలనుకునే వారు దానితో పాటు తాజా కూరగాయలు, పండ్లు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.నాన్ వెజ్ తో పాటు కూరగాయలు, సలాడ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ప్రోటీన్ తో పాటు ఫైబర్ కూడా అందుతుంది.అందుకే గత కొన్ని సంవత్సరాలుగా మొక్కలు ఆధారిత ఆహారం గ్లోబల్ లేబుల్ లపై ట్రెండింగ్ లో ఉంది.
మాంసాహారం తినే వారిపై ఈ ప్రత్యేక పరిశోధన జరిగింది.ముఖ్యంగా చెప్పాలంటే రెడ్ మీట్ లేదా ప్రాసెస్ చేసిన మాంసాన్ని వారానికి రెండుసార్లు తినేవారికి గుండెపోటు, స్ట్రోక్ తో సహా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని మూడు నుంచి ఏడు శాతం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తెలిసింది.
ఈ కారణాల వల్ల మరణించే ప్రమాదం మూడు శాతం ఎక్కువగా ఉందని కూడా చెబుతున్నారు.గుండె జబ్బు( heart disease ) వచ్చే ప్రమాదం నాలుగు శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.అయితే చేపలు తినే వారికి, గుండె జబ్బులు మరణాల మధ్య ఎటువంటి సంబంధం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి.తక్కువ నాన్ వెజ్ తింటూ బరువును అదుపులో ఉంచుకునీ, ధూమపానం, మద్యపానం పూర్తిగా మానేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను( Health benefits ) పొందవచ్చు.
అలాగే ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి.మీ బీపీ, షుగర్ ను చెక్ చేసుకుంటూ ఉండాలి.ధ్యానం కూడా చేయాలి.
.