నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ గా నల్లగొండ జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కింది.నల్లగొండ జిల్లా కట్టంగూరు మండల కేంద్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కడవేరు సురేంద్ర మోహన్ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాధ్యతలు చేపట్టారు.
సురేంద్రమోహన్ నియామకం పట్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.కట్టంగూరు మండలానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు,నాయకులు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సురేంద్ర మోహన్ గతంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా పనిచేశారు.దీనితో ఉమ్మడి జిల్లా ప్రజలకు సుపరిచితులు కావడంతో ఆయన నియామకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.