సూర్యాపేట జిల్లా:పోలీస్ స్టేషన్ల తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గురువారం ఆత్మకూరు (ఎస్)పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి, పోలీస్ పరేడ్ ను పరిశీలించారు.ఎస్పీకి సూర్యాపేట డిఎస్పీ రవి, సిఐ సురేందర్ రెడ్డి,స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు.
స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన ఎస్పీ,సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.అనంతరం స్టేషన్ రికార్డ్స్, పరిసరాలు పరిశీలించి తనిఖీ చేసి,పోలీస్ స్టేషన్ మ్యాప్,గ్రామాల హద్దులను,కేసు ఫైల్స్, కోర్టు వ్యవహారాలు, రిసెప్షన్,కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు పరిశీలించి,ఎన్ఫోర్స్మెంట్ గురించి సమీక్షించారు, రౌడి షిటర్స్,సస్పెక్ట్ పై నిఘా ఉంచాలన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసులు, ఫిర్యాదులు పెండింగ్ ఉంచకుండా ఎప్పటికపపుడు పరిష్కరించాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచాలని,ప్రతి విషయమును రికార్డుల యందు జాగ్రత్తగా నమోదు పరచాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిని మర్యాద పూర్వకముగా చూసి,వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు క్షుణ్ణంగా చేయాలని,కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు.సామాజిక అంశాలు,దొంగతనాలు,రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల నివారణ, బాలకార్మిక వ్యవస్థ,సీసీ కెమెరాల ఏర్పాటు మొదలగు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీకాంత్,డిసిఆర్బి ఎస్ఐ యాకూబ్,పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్ఎస్ఐ సురేష్,డిసిఆర్బి సిబ్బంది అంజన్ రెడ్డి,శేఖర్ రెడ్డి, ఎస్పి సీసీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.