మొదటి పంట కాలంలోనే రూ.31 వేల కోట్ల రైతుల రుణమాఫీని చేస్తాం: మంత్రి తుమ్మల

నల్లగొండ జిల్లా:గడచిన ఐదేళ్లలో రైతులకు ఏ బ్యాంకులో ఎంత బాకీ ఉన్నా రెండు లక్షల వరకు రుణమాఫీ( Runamafi) చేయాలని రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నదని,క్యాబినెట్ నిర్ణయం ప్రకారం 22 లక్షల తెల్లకార్డులు కలిగిన రైతులకు ఇది వరకే 18 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని,ఈ నెలాఖరు నాటికి తెల్లకార్డులు లేని 4 లక్షల మంది రైతులకు వారి ఖాతాలలో రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.బుధవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని,అలాగే పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి తుమ్మల ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల( Thummala Nageswara Rao) మాట్లాడుతూ రూ.2 లక్షల పైన రుణాలు ఉన్న రైతులకు కూడా రుణాలు మాఫీ చేసేందుకు షెడ్యూల్ ప్రకటిస్తామని, ఎట్టిపరిస్థితుల్లో ఈ పంట కాలంలోనే 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీని చేసి తీరుతామని స్పష్టం చేశారు.దీంతోపాటు పంట కాలానికి రూ.7500 రైతు భరోసా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని,ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతు భరోసా చేస్తామని వెల్లడించారు.అలాగే ఈ సంవత్సరం నుండే రైతు పంటల బీమాను సైతం అమలు చేస్తామని, రైతులు ఏ పంట వేసినా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతు పంట బీమా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ధాన్యం కొనుగోలులో భాగంగా రైతులు ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని,పత్తిని సైతం అలాగే తేవాలని,ఈ సంవత్సరం తెలంగాణలో కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండి దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణ తయారు కానుందన్నారు.

 We Will Waive Off Rs 31,000 Crore Farmers' Loans During The First Crop Season: T-TeluguStop.com

జనవరి నుండి రేషన్ కార్డుల( Ration cards) ద్వారా అందరికీ సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని, అందుకే సన్న రకాలకు మద్దతు ధరతో పాటు, రూ.500 బోనస్ వస్తుందన్నారు.ఆయిల్ ఫామ్ వల్ల మంచి లాభాలు,దిగుబడి ఉన్నందున రైతులు ఆయిల్ ఫామ్ పంట( Oil farm crop )ల సాగుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని,నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం 10 వేల ఎకరాలలో ఆయిల్ ఫామ్ వేసారని, ప్రతి ఎకరాకు లక్షన్నర నుండి రెండు లక్షల వరకు ఆయిల్ ఫామ్ ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉందని,అందువల్ల రైతులు ఆయిల్ పామ్ తోటలు వేయాలని కోరారు.ఇంకా 70 లక్షల ఎకరాలలో పామాయిల్ తోటలు వేసే అవకాశం ఉందని,5 సంవత్సరాలలో తెలంగాణలో 10 లక్షల ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.

కరీంనగర్,మెదక్,మహబూబ్ నగర్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తున్నామని,తర్వాత నల్గొండలో ఫాక్టరీ కట్టిస్తామని వెల్లడించారు.అనంతరం రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ…రైతులకు న్యాయం చేసేందుకు, రైతు సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు.

రైతు రుణమాఫీలో భాగంగా ఇప్పటి వరకే 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందని,నల్గొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యం పండుతుందని,రైతులు ధాన్యాన్ని ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే 24 గంటల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించే ఏర్పాటు చేస్తామన్నారు.ఎస్ఎల్బీసి వద్ద గతంలో బత్తాయి కోసం నిర్మించిన షెడ్డులో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రితో విజ్ఞప్తి చేశారు.

అనంతపూర్ తర్వాత నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా బత్తాయి సాగు జరుగుతుందని, సుమారు 50000 ఎకరాలలో బత్తాయి సాగు చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్,అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోనిరమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్,స్థానిక కౌన్సిలర్ అలివేలు,డిసిసిబి డైరెక్టర్ సైదులు,పిఎసిఎస్ డైరెక్టర్లు,డిఎస్ఓ వెంకటేశ్వర్లు,జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్,పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, మార్కెటింగ్ జిల్లా అధికారి ఛాయా దేవి,ఆర్డీవో శ్రీదేవి, డిఎస్పీ శివరాం రెడ్డి,ఇతర ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube