నల్లగొండ జిల్లా:తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly elections ) నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లపై బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్ సమీక్ష చేయనుంది.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తుంది.
ఈసీ(Election Commission ) సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు,ఎఫ్ఐఆర్‌లు,ఓటరు సమాచార పత్రాలు,ఓటరు కార్డుల పంపిణీ స్థితిగతులపై సీఈసీ ఆరా తీసే అవకాశం ఉన్నట్లు,పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితర అంశాలపై కూడా నితీశ్ వ్యాస్ చర్చించనున్నట్లు సమాచారం.