తెలంగాణలో పోలింగ్ ఏర్పాట్లపై నేడు సీఈసీ సమీక్ష
TeluguStop.com
నల్లగొండ జిల్లా:తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లపై బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్ సమీక్ష చేయనుంది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తుంది.ఈసీ(Election Commission ) సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు,ఎఫ్ఐఆర్‌లు,ఓటరు సమాచార పత్రాలు,ఓటరు కార్డుల పంపిణీ స్థితిగతులపై సీఈసీ ఆరా తీసే అవకాశం ఉన్నట్లు,పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితర అంశాలపై కూడా నితీశ్ వ్యాస్ చర్చించనున్నట్లు సమాచారం.
తొలిప్రేమ రెమ్యూనరేషన్ తో పవన్ అలాంటి పని చేశారా… ఏమైందంటే?