నల్లగొండ ఎన్ఆర్ఐల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్దకమేనా...?

నల్లగొండ జిల్లా:ఉద్యమాల పురిటిగడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) నుండి ఎంతో మంది నాయకులు తెలంగాణ రాష్ట్రంలో నాటి సాయుధ రైతాంగ పోరాటం నుండి నిన్నటి తెలంగాణ ఉద్యమం వరకు తమ పోరాట స్పూర్తి కొనసాగించారు.ఖండాంతరాలు దాటినా ఆ పోరాట పటిమను మాత్రం ఈ నల్లగొండ బిడ్డలు మరవలేదు.రాజకీయ అవకాశాల కోసం అనేక మంది ప్రవాస భారతీయులు ప్రయత్నం చేసినప్పటికి శానంపూడి సైదిరెడ్డి( Shanampudi Saidireddy ) ఒక్కరే హుజుర్ నగర్ నుండి 2019 ఉప ఎన్నికల్లో గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు.2001 నుండి 2014 వరకు ఉద్యమ నేపథ్యం ఉండి 2014 నుండి నేటి వరకు తెలంగాణ అభివృద్దిలో తమవంతుగా విశేషంగా క్రుషి చేసిన గడ్డంపల్లి రవిందర్ రెడ్డి,జలగం సుధీర్ లకు మాత్రం ఎటువటి అవకాశాలు రాలేదు.

 Is The Political Future Of Nalgonda Nris In Question?, Nalgonda District, Shanam-TeluguStop.com

యువతకు స్పూర్తిగా ఈ ఇద్దరు అనేక కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.మొదట్లో కేటీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినప్పటికి కేవలం కొద్దిమంది చేతుల్లోనే అధికారం ఉండి తెలంగాణ ప్రాంతంలో అభివృద్ది విషయంలో నిర్లక్ష్యం, నమ్ముకున్న వారికి ఆత్మగౌరవం దక్కకపోవటంతో పార్టీ అధిష్టానంతో అనేకసార్లు చర్చలు జరిపారు.

నాగర్జున సాగర్(Nagarjuna Sagar ) టికెట్ కోసం ప్రయత్నం చేసిన గడ్డంపల్లి తన సంపాదనలో అధిక బాగం సేవ కార్యక్రమాలకు వినియోగించినప్పటికి బీఆర్ఎస్ పార్టీ చిన్నచూపు చూడటంతో ఎన్నికలకు ముందు తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.సాగర్ అభ్యర్ది జయవీర్ రెడ్డి గెలుపుకు తనవంతు కృషి చేసారు.

ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ పేరుతో సుమారు 100 సమస్యల మీద కొట్లాడిన జలగం సుధీర్ కోదాడ టికెట్ కోసం 2018 మరియు 2023 లో ప్రయత్నం చేసినప్పటికి ఫక్తు రాజకీయ ధ్యాసలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సుధీర్ ని ఘోరంగా అవమానపర్చింది.ఇండిపెండెంట్ గా బరిలో దిగుదామనుకున్న జలగం సుధీర్(Jalagam Sudheer ) ఉత్తమ్ దంపతుల సూచనతో విరమించుకుని 23 సంవత్సరాలు పనిచేసినప్పటికి తనను నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు.

జిల్లా వ్యాప్తంగా తమదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న గడ్డంపల్లి రవిందర్, జలగం సుధీర్ ల రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube