జనం నాడి పసిగట్టిన కాంగ్రెస్ ! ఈ వ్యూహం వర్కౌట్ అయ్యేనా ?

లంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ దానికి అనుకూలంగానే ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటుంది.ఇటీవల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ బాగా బలపడిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడం , దీనికి తగ్గట్లుగానే పార్టీలోను పెద్ద ఎత్తున చేరికలు నమోదు అవ్వడం, బీఆర్ఎస్ కాంగ్రెస్ ( BRS Congress )మద్యనే ప్రధాన పోటీ అన్నట్లుగా పరిస్థితి ఉండడంతో , బీఆర్ఎస్ పైన పై చేయి సాధించేందుకు కాంగ్రెస్ అనేక వ్యూహాలకు తెరతీస్తోంది ఎన్నికల ప్రచారంకు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో మరింతగా ప్రజలను ఆకట్టుకునే విధంగా అనేక ఆస్త్రాలను బయటకు తీస్తోంది.

 Congress Has Sensed The Nerves Of The People! Will This Strategy Work Out , Tela-TeluguStop.com

  దీనిలో భాగంగానే నియోజకవర్గాల్లో స్థానికంగా నెలకొన్న సమస్యలను హైలెట్ చేసి ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది .

Telugu Brs, Congressasembly, Telangana-Politics

స్థానిక సమస్యలను ఎక్కువగా ప్రస్తావించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చు అనే లెక్కల్లో ఉంది.ప్రజలు కూడా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కాంగ్రెస్ గుర్తించిందని భావిస్తారని , ఇది తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటుంది.అందుకే కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువగా స్థానిక సమస్యలను హైలెట్ చేయాలని ఏఐసిసి , పిసిసి అబ్జర్వర్లు అందరికీ వ్యూహకర్తలు సు సూచించారట.

స్థానిక సమస్యలను ప్రస్తావించే సమయంలో  ఆ సమస్యలు ఎదుర్కొంటున్న వారితోనే వీడియో మాట్లాడించారని కూడా కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్తలు చెప్పారట .ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి సమస్యలను ప్రస్తావిస్తే అది ఆరోపణగా మాత్రమే ఉంటుందని,  అదే నేరుగా ప్రజల సమస్యలను చెప్పుకుంటున్నట్లుగా ఉంటే.  జనాల్లోకి బాగా వెళుతుందని మిగతా ప్రాంతాల పైన ఆ ప్రభావం కనిపిస్తుందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటుందట.

Telugu Brs, Congressasembly, Telangana-Politics

 అందుకే ఈ చివరి వారంలో లోకల్ సమస్యలను హైలెట్ చేయాలని కాంగ్రెస్( Congress ) నిర్ణయించుకోవడంతో , అభ్యర్థులు ఇప్పటికే ఈ తరహా ప్రచారాన్ని మొదలుపెట్టారట. ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించే సమయంలో ప్రతి ఒక్కరిని పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలని,  అలాగే ఎన్నికల ప్రచార సమయంలో తటస్తులు , ఆయా ప్రాంతాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వారిని వెంట తీసుకువెళ్తే మరింతగా కలిసి వస్తుందనే విషయాన్ని కాంగ్రెస్ వ్యూహకర్తలు చెప్పడంతో ఇప్పుడు అభ్యర్థులు అదే వ్యూహాన్ని అమలు చేసే పనులు నిమగ్నం అయ్యారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube