తెల్ల జుట్టు.ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
అందుకు కారణాలు అనేకం.ఏదేమైనప్పటికీ తెల్ల జుట్టు అందంతో పాటు తమలోని ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బ తీస్తుంది.
అందుకే తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు చాలా మంది కృత్రిమ రంగులపై ఆధారపడుతుంటారు.అయితే అటువంటి వాటిని వాడటం వల్ల జుట్టు ఆరోగ్యం తీవ్రంగా పాడవుతుంది.
ఫలితంగా హెయిర్ ఫాల్, డ్రై హెయిర్ వంటి సమస్యలు సతమతం చేస్తుంటాయి.
అందుకే సహజంగానే తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి.
అయితే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ప్యాక్ అద్భుతంగా అందుకు సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసి బాగా మరిగించాలి.
ఇలా మరిగించిన వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్ మరియు కాఫీ డికాక్షన్ వేసి బాగా మిక్స్ చేసి నైట్ అంతా వదిలేయాలి.
మరుసటి రోజు అందులో మూడు టేబుల్ స్పూన్లు ఇండిగో పౌడర్ మరియు వాటర్ వేసుకుని కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా చేస్తే తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది.
వారంలో ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే కృత్రిమ రంగుల పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.ఈ రెమెడీ సహజమైన హెయిర్ డై గా పనిచేస్తుంది.
పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు సైతం దూరమవుతాయి.