సూర్యాపేట:జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి( Guntakandla Jagadish Reddy )తో మాకు,మా కుటుంబానికి ప్రాణహాని ఉందని,నిత్యం పోలీసులు మమ్ములను అనేక విధాలుగా వేధిస్తున్నారని ఉమ్మడి నల్గొండ జిల్లా( Nalgonda District ) డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య సోదరి ఆవుదొడ్డి భాగ్యమ్మ ఆరోపించారు.ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అనునిత్యం మంత్రి జగదీష్ రెడ్డి కోసం నేను,నా కుమారులు,నా కుటుంబం మొత్తం కూడా త్యాగం చేశామని,ఈరోజు వట్టే జానయ్యకు,మంత్రికి తగాదాలు ఉంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలి కానీ, అన్యాయంగా తమ కుమారులపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు.
చిన్న పాపకు మందులు తెస్తానన్న వెళ్ళిన తన కొడుకు ఇంటికి తిరిగి రాలేదని,ఆరా తీస్తే పోలీసులు తీసుకెళ్లారని తెలిసిందని,సమాచారం ఇవ్వకుండా తమ కుమారులను ఎలా తీసుకెళ్తారని ఆవేదన వ్యక్తం చేశారు.మంత్రి ఇప్పటికైనా తమ కుమారులపై కేసులు పెట్టకుండా చూడాలని కోరారు.
సమస్యలు ఉంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ, కూలినాలీ చేసే తమ కుటుంబాలపై పోలీసులు( Police ) అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేసి వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.