నల్గొండ జిల్లా:అనుముల మైనారిటీ గురుకుల బాలుర పాఠశాల/కళాశాల నుండి నౌషాద్ అనే ఇంటర్ విద్యార్థి ఏప్రిల్ నెల 9 వ తారీకు నుండి 12 వరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు నల్గొండ జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు.రాష్ట్ర స్థాయిలో తమ పాఠశాల విద్యార్థి ఎంపిక కావడం పట్ల గురుకుల పాఠశాల కళాశాల యాజమాన్యం మరియు సిబ్బంది హర్షం వ్యక్తం చేసి,విద్యార్థిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పాశం వెంకట్ రెడ్డి,పాఠశాల యాజమాన్యం చంద్రకళ, ఉస్మాన్,చంద్రారెడ్డి,జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ సురేష్,పిఈటీ కోటేష్ తదితరులు పాల్గొన్నారు.