లేబర్ ను తొలగించిన ఎంపిఎల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

నల్లగొండ జిల్లా: చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ పరిధిలోని ఎంపిఎల్ ఫ్యాక్టరీలో 35 ఏళ్లుగా పనిచేస్తున్న వెంకటాపురం గ్రామానికి చెందిన 100 మంది కూలీలను ఫ్యాక్టరీ నుండి గెంటేయించిన ఎంపిఎల్ యాజమాన్యంపై లేబర్ కమీషనర్,స్థానిక తహసిల్దార్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు.సోమవారం స్పాంజ్, ఐరన్ ఎంపిఎల్ ఫ్యాక్టరీ గేటు ముందు స్థానిక కూలీలతో కలిసి బైఠాయించి ధర్నా నిర్వహించారు.

 Action Should Be Taken Against The Management Of Mpl Who Dismissed The Labor, Mp-TeluguStop.com

దీనితో హుటాహుటిన అక్కడికి వచ్చిన ఆర్ఐ బాధిత లేబర్ నుండి ఫిర్యాదులు స్వీకరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ యాజమాన్యం స్థానిక కూలీలకు ద్రోహం తలపెట్టి బయటి కూలీలను తీసుకురావడంతో రోజువారీ పనిచేసే కూలీలు ఫ్యాక్టరీ లోపలికి వెల్తుంటే గెంటేయించడం చట్టరీత్యా నేరమని,సదరు యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకుని స్థానిక కూలీలకు పని భద్రత కల్పించాలని, లేనిచో కూలీల పోరాటాన్ని నిరంతరంగా సాగిస్తామని హెచ్చరించారు.

ఎంపిఎల్ యాజమాన్యంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే స్పందించలేదని,అందుకే కూలీలతో గేటుకు అడ్డంగా కూర్చుని ధర్నా చేశామని తెలిపారు.యాజమాన్యం వైఖరి ఇలాగే కొనసాగితే ప్రతీ రోజూ ఫ్యాక్టరీ పనులను సాగనివ్వమని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube