నల్లగొండ జిల్లా:దరిద్రుడు కేసీఆర్ బ్రాహ్మాణ వెల్లంల ప్రాజెక్టు( Brahmana Vellemla Project )ను 10 ఏళ్ళైనా పూర్తి చేయలేదని,వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి ప్రాజెక్టును పూర్తి చేసుకుందామని రాష్ట్ర రోడ్లు,భవనాల మరియు సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy) అన్నారు.శుక్రవారం నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మాణవెల్లంల గ్రామంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి నల్లగొండ- బ్రాహ్మాణవెల్లంల-చిట్యాల వరకు రూ.67 కోట్ల నిధులతో చేపట్టనున్న నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులకు, ఇందిరమ్మ ఇళ్ళకు శంకుస్థాపన చేశారు.అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదని,మంత్రి అయిన తర్వాత అభివృద్ధి పనులకు పుట్టిన గ్రామానికి రావడం,ఇంత ఎండలో కూడా నాకు ఘనస్వాగతం పలికడం చాలా సంతోషంగా ఉందన్నారు.ప్రతి ఇంటి సమస్యను నా సమస్యగా నెరవేరుస్తానని, 6 నెలలో డబుల్ రోడ్డును పూర్తిచేసుకుందామన్నారు.
నాకు రాజకీయ జన్మనిచ్చిన నా ఊరే నా బలం,బలగమని,నన్ను పెంచి పోషించిన గ్రామానికి ఎంత చేసినా తక్కువేనని, మీకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
మన గ్రామాభివృద్ధికి యువకుడైన ఎమ్మెల్యే వీరేశం( MLA Vemula Veeresham ) సహకారం కూడా ఉంటుందన్నారు.
గతంలో పని చేసిన ఎమ్మెల్యే వార్డు మెంబర్ కూడా కాలేడని, గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు కూడా లేవని, ఇందిరమ్మ రాజ్యంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.ప్రతీక్ పేరు మీద లెబ్రరీ నిర్మాణం చేసుకుందామని, మన గ్రామాన్ని సోలార్ గ్రామ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని,ప్రతి మహిళల సంఘాలకు కోటి రూపాయలను ఇస్తామని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలబడాలని కోరారు.కవిత గల్లిలో బతుకమ్మ ఆడుతూ ఢిల్లీలో లీక్కర్ అమ్ముతుందన్నారు.అనంతరం ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ జిల్లా అభివృద్దే లక్ష్యంగా అనేక నిధులు తీసుకువస్తున్న మంత్రికి అందరం మద్దతుగా ఉండాలన్నారు.రోడ్డు నిర్మాణ పనులకు రూ.67 కోట్ల నిధులు తీసుకొచ్చిన మంత్రి ధన్యవాదాలు తెలిపారు.బ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టు అధిక నిధులు ఇచ్చి పూర్తి చేసుకుందామని,ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాలువను కూడా నిధులు మంజూరు చేయాలని కోరారు.నార్కెట్‌పల్లి డిపోను పున:ప్రారంభం చేయాలని, మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న రోడ్లకు నిధులు కేటాయించాలని కోరారు.అనంతరం గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎంపిపి సూదిరెడ్డి నరేందర్ రెడ్డి,అధికారులు,మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య తదితరులు పాల్గొన్నారు.