కాలుష్య నివారణపై జీడిమెట్ల రవీందర్ చైతన్య సైకిల్ యాత్ర

నల్లగొండ జిల్లా:కాలుష్యం బారి నుండి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులందరి దని ఇండియన్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్ అన్నారు.మునుగోడు మండలం కొంపెల్లి గ్రామం నుండి కాలుష్య నివారణపై చైతన్య సైకిల్ యాత్రను శనివారం త్రివర్ణ పతాకంతో జండా ఊపి రవీందర్ మాతృమూర్తి ఎల్లమ్మ ప్రారంభించారు.

 Jeedimetla Ravinder Chaitanya Cycle Trip On Pollution Prevention-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాత్రను మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాలు చుట్టి డిసెంబర్ 02 న జరిగే జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ లో అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తామన్నారు.కొంపెల్లి,చీకటిమామిడి, పలివేలలోని స్వతంత్ర సమరయోధులు,పర్యావరణవేత్త కొండవీటి గురునాథరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ మునుగోడు మీదుగా చండూరు మండలానికి యాత్ర బయలు దేరుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఈరిగి విజేందర్,డోకూరి వేణుగోపాల్ రెడ్డి, బోయపర్తి సురేందర్,సునీల్ పుట్టపాక,నెల్లికంటి యాదయ్య, వీరమల్ల గోపాల్,జీడిమెట్ల సైదులు,మోగుదాల రాజు, ఆనగంటి కృష్ణ,గజ్జల బాలరాజ్,గోస్కొండ చంద్రయ్య, గోల్కొండ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube