చండూరు గ్యాస్‌ ఏజెన్సీల నిలువు దోపిడీ...!

నల్లగొండ జిల్లా: చండూరు మండలంలో గ్యాస్‌ ఏజెన్సీలు నిలువు దోపిడీ చేస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.మండల కేంద్రంలోని నాంపల్లికి చెందిన ఓ ఏజెన్సీ డీలర్ దగ్గరికి ఎప్పుడు వెళ్లినా గ్యాస్‌ లేదని సమాధానం చెప్పి,సరే చూస్తానని అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్యాస్‌ బుక్‌ చేసుకున్న వ్యక్తి ఇంటికీ గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేయాలని ఉన్నప్పటికీ ఒకే చోటుకు గ్యాస్‌ వెహికిల్‌ వచ్చి అక్కడే సిలిండర్లు వేసి పోతారని,

 Exploitation Of Chandur Gas Agencies, Exploitation ,chandur Gas Agencies, Nalgon-TeluguStop.com

అక్కడి నుంచే అందరూ సిలిండర్లు మోసుకెళ్లాల్సి వస్తున్నదని,అంతేకాకుండా ఒక్కో సిలిండర్‌పై అదనంగా రూ.80,కేవైసీ పేరుతో ఆన్‌లైన్‌ చేస్తామని చెబుతూ మరో రూ.50 వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు.రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ అని ప్రభుత్వం చెబుతుంటే,ఇక్కడ రూ.1000 చెల్లిస్తున్నామని వాపోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత శాఖా అధికారులు స్పందించి గ్యాస్‌ మండలంలో నిర్వాహకులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube