మునుగోడులో ఓ ఊపు ఊపుతున్న వ్యాపారాలు

నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నిక నియోజకవర్గ ప్రజలకు,వ్యాపారస్తులకు వరంగా మారింది.గత నెల 6 న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తరువాత మునుగోడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

 Businesses That Are Booming In The Past-TeluguStop.com

దీనితో అటు రాజకీయ పార్టీలకు,ప్రజలకు మాత్రమే కాదు వ్యాపార వర్గాలకు కూడా ఉప ఎన్నిక ఉత్సాహాన్ని నింపుతుంది.మూడు నెలలు పెళ్లిళ్ల సీజన్ కూడా లేకపోవడంతో ఎలా అని భాధపడిన వ్యాపారస్తులకు ఉప ఎన్నిక రూపంలో ఆనందం వెతుకుంటూ వచ్చిందనే చెప్పాలి.

ముఖ్యంగా ఎమ్మెల్యే రాజీనామా చేసిన నాటి నుండి మునుగోడు హెడ్ క్వార్టర్ లో నే అన్ని పార్టీల నేతలు మకాం వేయడంతో మంది మార్బలం అక్కడే తిష్టవేసి ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఇక్కడ వ్యాపారాలు ఓ రేంజ్ లో పరుగులు పెడ్తున్నాయ్.ఇప్పటికే మునుగోడులో అన్ని ఫంక్షన్ హల్ లను ఒక్కోపార్టీ అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి బుక్ చేసుకున్నాయి.

ఇప్పటికే అన్ని పార్టీల మీటింగ్లు మునుగోడులో నిర్వహించడంతో ఏ పార్టీ సమావేశం ఏర్పాటు చేసినా వారికి భోజనం ఏర్పాటు చేస్తున్నారు.అందుకు గాను అటు చికెన్ సెంటర్ లు, కూరగాయల షాప్ లు,కిరాణా షాప్ లకు గిరాకీ ఫుల్ గా నడుస్తుంది.

పార్టీ ప్రచారాలకు పెద్ద ఎత్తున ప్లెక్సీ ఏర్పాటు చేస్తుండంతో ఫ్లెక్సీ షాప్ లు కూడా మునుపెన్నడూ లేని విధంగా బిజీబిజీగా మారిపోయి వ్యాపారం జోరుగా సాగుతోంది.ఏదైనా మీటింగ్ ఉంటే దానీతో ఫంక్షన్ హాల్ లో వంటలు వంటమనుషులు, క్యాటరింగ్ బాయ్స్,గ్యాస్ లు,కట్టెలు,సౌండ్ సిస్టమ్ లు,పూలబండ్లు,శాలువాలతో బట్టల షాపులు, టపాకాయలు,ప్రచార రథాల కోసం వాడే వెహికల్స్, మైక్ సెట్ లు,పెట్రోల్ బంక్ లు ఇలా అన్నిరకాల వ్యాపారాస్తులకు ఉపాధి ఏర్పడింది.

వీటితో పాటుగా మద్యం కూడా ఏరులై పారుతుంది.అన్ని మండలాలలో ఎన్నడూ లేని విధంగా మద్యం అమ్మకాలు జోరుగా నడుస్తున్నాయి.

వాటితో పాటుగా అన్ని ఊళ్ళలో ఉన్నవాటికి కంటే రెట్టింపు బెల్ట్ షాపులు వెలిశాయి.వీటితో పాటుగా ఉపఎన్నిక ముందు ఖాళీగా ఉన్న ఇండ్లు సైతం ఫుల్ అయ్యి, ప్రస్తుతం అద్దెకు ఇండ్లు దొరకని పరిస్థితి నెలకొంది.

ముందు ముందే చాలా మంది వివిధ పార్టీల నాయకులు ఇక్కడే మకాం వేశారు.దానితో ఇంటి ఓనర్ లు కూడా మూడు వేలు ఉన్న ఇంటి కిరాయిలు 25 వేలకి పెంచేశారు.

రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అన్ని రకాల బిజినెస్ లకు ప్రాణం వచ్చి పరుగులు తీస్తున్నాయ్.ఇంత వరకు అంతా బాగానే ఉంది కానీ,ఇంతకీ ఉపఎన్నిక ఇప్పుడు ఉంటుందా? ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది? ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి?ఇంకా ఆలస్యం అయితే రాజకీయ నాయకుల బడ్జెట్ పరిస్థితి ఏమిటి? బడ్జెట్ మరింత పెరిగితే భరించే స్థితిలో ఉన్నారా? ఉప ఎన్నిక కథ ఏమవుతుందో కానీ,నాయకుల ఖజానా మాత్రం కరిగి పోతుందని స్థానిక ప్రజల్లో చర్చ జోరుగా నడుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube