నల్గొండ జిల్లా అర్జాలబావి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఇటీవల పార్టీలో చేరిన కౌన్సిలర్ తో కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి వచ్చారు.ఈ క్రమంలో కౌన్సిలర్ ను స్థానికులు అడ్డుకున్నారు.
దీంతో అడ్డుకున్న స్థానికులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.అయితే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దాడి చేయించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.