సైబర్ నేరగాళ్లు( Cyber Criminals ) అమాయక ప్రజలను మోసం చేసేందుకు సరికొత్త దారులను అన్వేషించి చాలా సులభంగా మోసాలకు పాల్పడుతున్నారు.ఈ క్రమంలోనే ఓ కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది.
సైబర్ నేరగాళ్లు డీప్ ఫేక్ టెక్నాలజీ తో వీడియో కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.తాజాగా కేరళలో డీప్ ఫేక్ టెక్నాలజీ( Deep Fake Technology ) సాయంతో స్నేహితుడి ఫేస్ తో వీడియో కాల్ చేసి డబ్బులు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
భారతదేశంలో తొలి డీప్ ఫేక్ కేసు ఇదే.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.కేరళలోని కోజికోడ్ కు చెందిన రాధాకృష్ణన్ కోల్ ఇండియా సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు.అయితే ఇతను పనిచేస్తున్న సమయంలో వేణు కుమార్ అనే మరొక వ్యక్తి కూడా ఇతనితో కలిసి విధులు నిర్వర్తించారు.

ఈ క్రమంలో సైబర్ కేటుగాడు డీప్ ఫేక్ సాయంతో వేణు కుమార్ ఫోటోతో.రాధాకృష్ణన్ కు వీడియో కాల్ చేసి తాను దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో ఉన్నానని, ఇండియాలో ఉన్న తన సోదరి ఆపరేషన్ కోసం రూ.40 వేలు కావాలని, త్వరలోనే తిరిగి ఇచ్చేస్తానని రిక్వెస్ట్ చేశాడు.వీడియో కాల్ లో వేణు కుమార్ ముఖం కనిపించడంతో వెంటనే రాధాకృష్ణన్ డబ్బులు పంపించాడు.
కొద్దిసేపటి తర్వాత మళ్లీ వేణు కుమార్ లాగానే రాధాకృష్ణన్ కు ఫోన్ చేసి మరో రూ.30000 కావాలని కోరాడు.అయితే రాధాకృష్ణన్ కు ఎందుకో చిన్న అనుమానం కలిగింది.
వెంటనే రాధాకృష్ణన్ తన స్నేహితుల సహాయంతో వేణు కుమార్ ఫోన్ నెంబర్ అడిగి తెలుసుకున్నాడు.

వేణు కుమార్ కు ఫోన్ చేయగా తాను ఏపీలో ఉన్నానని, తాను ఫోన్ చేసి డబ్బులు అడగలేదని చెప్పడంతో రాధాకృష్ణన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడు గుజరాత్( Gujarat ) కు చెందిన మర్తుజ్ మియా గా గుర్తించారు.ఈ కేసులో ప్రధాన నిందితుడైన కుశాల్ షా పరారీలో ఉన్నట్లు సీపీ రాజ్ గోపాల్ మీనా తెలిపారు.







