నల్లగొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ మండల కేంద్రంలో కాంగ్రేస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో పాల్వాయి స్రవంతి సమక్షంలో చండూర్ మండలంలోని మాజీ ప్రజా ప్రతినిధులు, పలు గ్రామాల యువకులు దాదాపు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారికి మూడు రంగుల జెండాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ రాజ్ గోపాల్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 5 సార్లు ఈ నియోజకవర్గానికి ప్రతినిధ్యం వహించి అనేక అభివృద్ధి పనులు చేశారని,రాజగోపాల్ రెడ్డి గెలిచానక నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు.ఆయన పార్టీ మారినా కాంగ్రెస్ క్యాడర్ అంత బలంగా ఉందని,కాబట్టి కార్యకర్తలు అందరూ కష్టపడి పని చేసి భారీ మెజారిటీతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
రానున్న రోజుల్లో ప్రతి ఇల్లు,ప్రతి ఊరు తిరుగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లె కళ్యాణి,కాంగ్రెస్ నాయకులు చల్లమల కృష్ణారెడ్డి,పలువురు నాయకులు పాల్గొన్నారు.