నల్లగొండ జిల్లా:కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నిక కోసం పడరాని పాట్లు పెడుతున్నాడని,ఒక్క బీజేపీ అభ్యర్థిని అడ్డుకోవడానికి వంద మంది నాయకులను దించినా ఫలితం లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి అన్నారు.శనివారం ఆయన నల్లగొండ జిల్లా మునుగోడులోని బీజేపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడాతూ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని,దమ్ముంటే సీఎం కేసీఆర్ ఈ విషయంపై బయటికి రావాలని డిమాండ్ చేశారు.
స్టీఫెన్ రవీంద్ర అనే పోలీసు ఆఫీసర్ కూడా ఈ డ్రామాలో నటించిండని,స్టిఫిన్ రవీంద్ర పట్టుకున్న డబ్బులను బయట పెట్టాలి.లేకుంటే రాజీనామా చేసి ఇంట్లో ఉండాలని సూచించారు.
పోలీసులు ఉన్నది ఎన్నికలను స్వేచ్ఛగా నడిపించేందుకు కానీ,అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.నలుగురు ఎమ్మెల్యేలు ఎందుకు మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు చెప్పడంలేదని ప్రశ్నించారు.
ఆ నలుగురు ప్రగతి భవన్ లో శిక్షణ తీసుకుంటున్నారా? అని దెప్పిపొడిచారు.రాష్ట్ర ప్రజానీకానికి,మునుగోడు ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలని కోరారు.