నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ నియోజకవర్గ( Nagarjuna Sagar Assembly constituency ) పరిధిలోని నందికొండ మున్సిపాలిటీ చైర్మన్,వైస్ చైర్మన్ పై శనివారం ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.అవిశ్వాసంపై చర్చించేందుకు జనవరి 6న ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే.
అయితే శుక్రవారం హైకోర్టు( High Court ) ఉత్తర్వులతో మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్లపై అవిశ్వాస బల నిరూపణ ప్రక్రియ నిలిచిపోవడంతో కౌన్సిలర్లు షాక్ కు గురయ్యారు.దీనితో అధికార,ప్రతిపక్ష కౌన్సిలర్లు అవిశ్వాసం నిలిచిపోవడానికి గల కారణం ఏంటని,కోర్టు ఉత్తర్వులు వచ్చినట్లు ఒక రోజు ముందు ఎందుకు తెలుపలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.