సన్ ట్యాన్ తో చింతెందుకు.. ఈ సింపుల్ చిట్కాను ఫాలో అయిపోండి!

గత కొద్ది రోజుల నుంచి ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మార్చి నెల రాకముందే ఎండలు మండిపోయాయి.

 Follow This Simple Tip To Get Rid Of Sun Tan! Sun Tan, Simple Tip, Latest News,-TeluguStop.com

దేశంలో పలుచోట్ల ఫిబ్రవరి లోనే ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి.ఇక వేసవి లో ప్రధానంగా వేధించే సమస్య సన్ ట్యాన్.

ఎంత ఖరీదైన సన్ స్క్రీన్ లోషన్ వాడినప్పటికీ చర్మం ట్యాన్ అవుతూనే ఉంటుంది.దాంతో ఈ సమస్యను వదిలించుకోవడానికి తెగ హైరానా పడుతుంటారు.

కానీ సన్ ట్యాన్ తో చింతెందుకు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే మీ చర్మం వైట్ గా బ్రైట్ గా మరియు సూపర్ షైనీ గా మెరిసిపోతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు టేబుట్ స్పూన్లు ప‌చ్చి పాలు వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి.ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ మరియు వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు చేతులకు తదితర ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేసుకుని ప‌ది నుంచి ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని.ఆపై ఏదైనా మంచి మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే ట్యాన్ సమస్యతో బాధ పడాల్సిన అవసరం ఉండదు.

ఈ చిట్కాను డైలీ రొటీన్ లో భాగం చేసుకుంటే మీ స్కిన్ టోన్ ఈవెన్ గా మారుతుంది.ట్యాన్ సమస్య తొలగిపోతుంది.అలాగే ఈ చిట్కాను పాటించడం వల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.చర్మం కాంతివంతంగా మరియు ఆకర్షణీయంగా మారుతుంది.కాబట్టి తప్పకుండా ఈ సింపుల్ చిట్కాను పాటించేందుకు ప్రయత్నించండి.అందంగా మెరిసిపోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube