వ్యవసాయంలో రసాయనిక ఎరువుల కన్నా.. జీవామృతం మిన్న..!

సేంద్రియ వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవామృతాన్ని వినియోగించి నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చు.జీవామృతం లో ఎక్కువ మోతాదులో బయోగ్యాస్, సహజ కార్బన్, నైట్రోజన్, ఫాస్పరస్, కాల్షియం లాంటివి మొక్కకు కావలసిన ఎన్నో పోషకాలు ఉంటాయి.

 How To Prepare Jeevamrutham For Organic Farming Details, Prepare Jeevamrutham ,-TeluguStop.com

నేల కూడా సారవంతం అవుతుంది.ఇంకా నేలలోని సూక్ష్మజీవులు ఎక్కువ మోతాదులో పెరుగుతాయి.

జీవామృతాన్ని ప్రకృతి వనరులతో సహజ సిద్ధంగా తయారు చేయవచ్చు.జీవామృతం రెండు రకాలలో తయారు చేసుకోవచ్చు.

ఆవు పేడ, ఆవు మూత్రం, పప్పుల పిండి, బెల్లంతో చేసే జీవామృతాన్ని ద్రవ జీవామృతం అంటారు.దీనిని 15 రోజులకు ఒకసారి తయారు చేసుకుని వాడుకోవచ్చు.పశువుల ఎరువు, వర్మి కంపోస్టులలో తయారుచేసిన జీవామృతాన్ని ఘనజీవామృతం అంటారు.దీనిని సంవత్సరంలో ఒకసారి తయారు చేసుకుని ఎకరం పంటకు దాదాపు 400 కిలోల వరకు వేయాలి.ఒక ఎకరం పంటకు ద్రవ జీవామృతం తయారు చేసుకునే విధానం: ఒక డ్రమ్ములో సుమారు 15 బిందెల నీరు పోసి అందులో 10 లీటర్ల ఆవు మూత్రం,

Telugu Agriculture, Biogas, Cow Dung, Cow Urine, Crops, Farmers, Fertilizer, Jag

10 కేజీల ఆవు పేడ, రెండు కేజీల బెల్లం లేదా పప్పు దినుసుల పిండి, పుట్టమన్నును గుప్పెడు వేసి బాగా కలిపి నీడలో 48 గంటల పాటు ఉంచాలి.ఇక రోజుకు రెండు లేదా మూడుసార్లు ఒక కర్ర సహాయంతో మొత్తం పదార్థాన్ని తిప్పాలి.9 నుండి 12 రోజుల మధ్య సూక్ష్మజీవుల వృద్ధి అధికంగా పెరుగుతుంది.పంటకు నీరు అందించేటప్పుడు 200 లీటర్లను మూడు లేదా నాలుగు సార్లు నీటితో పాటు పారించాలి.

మూడు నాలుగు సార్లు జీవామృతాన్ని వడగట్టి ఆ నీటితో పిచికారి చేయాలి.

Telugu Agriculture, Biogas, Cow Dung, Cow Urine, Crops, Farmers, Fertilizer, Jag

ఘన జీవామృతం తయారు చేసుకునే విధానం: ఒక షెడ్డులో 100 కేజీల పశువుల పేడ లో ఐదు లీటర్ల ఆవు మూత్రాన్ని చల్లి బాగా కలియబెట్టి, గోనెపట్ట కప్పాలి.రెండు రోజుల అనంతరం దీనిని పలుచగా చేసి ఆరబెడితే కేవలం పది రోజుల్లోనే ఘనజీవామృతం తయారవుతుంది.దీనిని పొలాల్లో చల్లిన తర్వాత దుక్కి దున్నడం ద్వారా భూమిలో కలిసిపోతుంది.

ఇది దాదాపు 6 నెలలు నిల్వ ఉంటుంది కాబట్టి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube