హడలెత్తిస్తున్న ఎండలు...!

నల్లగొండ జిల్లా: సోమ, మంగళవారాల్లోనూ ఎండల పరిస్థితి తీవ్రంగానే ఉంటుందంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రజలను అప్రమత్తం చేసింది.రాష్ట్రంలో ఈ రెండు రోజులూ తీవ్రమైన వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.

 Govt Issued Orange Alert On High Temperatures, Orange Alert ,high Temperatures,-TeluguStop.com

ప్రధానంగా సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌ను తాకే అవకాశం ఉందంటూ ‘ఆరెంజ్‌’ రంగు హెచ్చరికలు జారీ చేసింది.ఈ సందర్భంగా ప్రజలంతా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్న నేపథ్యంలో చల్లని ప్రదేశాల్లోనే ఉండాలి.ఎండలోకి వెళ్లకపోవడం మేలని, ఇంటి నుంచి బయటకు వెళ్తే తప్పనిసరిగా తలకు వస్త్రం చుట్టుకోవాలని, దాహం అనిపించకపోయినా నీళ్లు తాగాలని,డీహైడ్రేషన్‌’కు గురికాకుండా చూసుకోవాలని,ప్రధానంగా అనారోగ్యంతో బాధపడేవారు ఇంట్లో ఉన్నప్పటికీ తగిన విశ్రాంతి తీసుకోవాలని,

వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త వహించాలని,ఇంట్లో తయారుచేసుకునే ద్రవ పదార్థాలు,మజ్జిగ, నిమ్మరసం,లస్సీ వంటివాటిని సేవించాలని,మంగళవారం కూడా జాగ్రత్తలు పాటించాలని వదులు దుస్తులు ధరించాలని,ఎండలోకి వెళ్తే రక్షణగా గొడుగు తీసుకెళ్లాలని సూచించింది.

తెలంగాణలో ఆదిలాబాద్‌,కుమురంభీం ఆసిఫాబాద్‌,మంచిర్యాల, నిర్మల్‌,జగిత్యాల, కరీంనగర్‌,పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం, నల్గొండ,సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌,హనుమకొండ జిల్లాలో తీవ్ర వడగాలుల ముప్పు ఉంటుందని సోమవారం 41-44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు ఉండొచ్చని అంచనా వేసింది.ఆదిలాబాద్‌,కుమురంభీం ఆసిఫాబాద్‌,మంచిర్యాల, నిర్మల్‌,నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,నల్గొండ, సూర్యాపేట జిల్లాలో మంగళవారం 40-43 డిగ్రీల సెల్సియస్‌ గా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలిపింది.

దీనితో ఇక్కడ తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube