నల్గొండ జిల్లా:జిల్లా కేంద్రంలో నల్గొండ,యాదాద్రి జిల్లాల వ్యవసాయ అధికారులకు,రైతుబంధు సమితి సభ్యులకు వానాకాలం సాగు సన్నద్ధతపై వర్క్ షాప్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిలుగా రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి,జగదీష్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,నల్లగొండ జెడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో రెండు జిల్లాలకు చెందిన ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, కలెక్టర్లు,రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు,వ్యవసాయ శాఖా అధికారులు తదితరులు పాల్గొన్నారు.