నల్లగొండ జిల్లా: తాము అగ్రకుల పార్టీల బానిసలం కాదని,మహనీయుల వారసులమని మునుగోడు మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ నేతలు అన్నారు.గురువారం నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో ఫ్రంట్ నియోజకవర్గ అధ్యక్షులు నారపాక అంజి మాదిగ ఆధ్వర్యంలో ఈనెల 25న చండూర్ లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ మునుగోడు నియోజకవర్గ చైర్మన్ మల్గ యాదయ్య, ఇంచార్జ్, ఎంఎస్ఎఫ్ జాతీయ నాయకులు జిల్లా వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల, అన్ని కుల, మహిళ సంఘాల నాయకులు, మేధావులు,విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ కార్యదర్శి అన్నపాక శంకర్, తిప్పర్తి అశోక్, కురుమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అందరిక పరమేష్,బీజేపీ మండల నాయకులు తిరిగి వెంకటేశం,కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు ఇరిగి శంకర్,బీజేపీ మండల నాయకులు ఇరిగి చరణ్,స్టూడెంట్ విభాగం అన్నపాక మహేష్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.