కులగణన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం చారిత్రాత్మక నిర్ణయం: పానుగంటి విజయ్ గౌడ్

నల్లగొండ జిల్లా:బీసీ కులగణన నిర్ణయం చారిత్రాత్మకమని, కులగణన తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly ) ఏకగ్రీవంగా ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి విజయ్ గౌడ్ బీసీ సంఘల ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా పానుగంటి విజయ్ మాట్లాడుతూ బీసీ కులగణన చేయడం వల్ల బీసీల యొక్క సామాజిక స్థితిగతులు,వారి యొక్క ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవచ్చని,రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లు పెంచినప్పుడల్లా బీసీల జనాభా లెక్కలు లేనందున న్యాయ స్థానాలు రిజర్వేషన్లను కొట్టేస్తున్నాయన్నారు.

 Historic Decision To Pass Caste Census Resolution Unanimously: Panuganti Vijay G-TeluguStop.com

జనగణన వల్ల స్థానిక సంస్థల్లో చట్టసభల్లో బీసీల వాటా ఎంత ఉండాలో తెలుస్తుందని,విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపునకు జనగణన ఉపయోగపడుతుందని, రాష్ట్ర అసెంబ్లీలో కులగణనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించడం పట్ల ముఖ్యమంత్రితో పాటు మంత్రులు,స్థానిక ఎంఏల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy )ని పూలమాలతో సన్మానించడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా యావత్తు బీసీల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వేంకటేశం, క్యాబినెట్ మంత్రులకు, కులగణనపై చర్చలో పాల్గొన్న శాసన సభ్యులకు,ఆమోదానికి మద్దతు తెలిపిన బీఆర్ఎస్,బీజేపీ,సీపీఐ,ఎంఐఎం పార్టీలకి ధన్యవాదాలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube