గ్రూపు-1పరీక్షను నిలిపివేయాలని హాల్ టికెట్స్ దహనం...

నల్లగొండ జిల్లా

:ఇటీవల టీఎస్పిఎస్సి నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష( Group 1 Exam ) పత్రం లీకేజీ వ్యవహారం తేలకుండా, నూతన బోర్డును నియమించకుండా,అదే కమిటీతో మళ్ళీ పరీక్షను నిర్వహించడం దుర్మార్గపు చర్యని స్వేరో స్టూడెంట్స్ యూనియన్( Students Union ) రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుముల సురేష్ స్వేరో( Anumula Suresh Swero ) అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంధాలయ కార్యాలయం వద్ద స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలోగ్రూపు-1 పరీక్షను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించి,అభ్యర్థుల హాల్ టికెట్స్ ను దహనం చేశారు.

 Hall Tickets Burning To Stop Group-1 Exam Details, District News,telugu District-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇప్పుడున్న టీఎస్పిఎస్సి బోర్డును రద్దు చేసి,నూతన బోర్డు ఎన్నిక తరువాతనే గ్రూప్ -1 పరీక్షను నిర్వహించాలని, లేకుంటే రాష్ట్రంలో ఉద్యమం పెద్ద ఎత్తున లేవనేత్తి రానున్న ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇస్తామని హెచ్చరించారు.స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఎల్లప్పుడూ విద్యార్థులకు, నిరుద్యోగులకు అండగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.యు నాయకులు రమేష్,జానీ,రాశేఖర్, సందీప్,శంకర్,బద్రి, మరియు అనేక మంది నిరుద్యోగులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube